12-04-2025 03:23:03 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు ,ఎమ్మెల్సీ దండే విఠల్, డిసిసి విశ్వ ప్రసాద్ రావు
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆధ్యాత్మికత తో జీవనశైలిలో మార్పు వస్తుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయం ఆవరణలో నిర్వహించిన హోమం కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి కలెక్టర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్ లో డిసిసి అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు, బిజెపి నేత వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీలు మల్లికార్జున్, బాలేష్ గౌడ్ ,ఏఎంసి మాజీ చైర్మన్ లు వెంకన్న ,మల్లేష్ పాల్గొన్నారు. సిర్పూర్ నియోజకవర్గం లోని పలు మండలాలలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్ వేడుకల్లో పాల్గొన్నారు. జయంతి సందర్భంగా హనుమాన్ ఆలయాలలు భక్తులతో కోలాహాలంగా కనిపించాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. అంజన్నకు భక్తులు మొక్కలు చెల్లించారు.