calender_icon.png 28 December, 2024 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

11-09-2024 01:55:51 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయ క్రాంతి): అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అర్హులైన వారు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ మండలానికి చెందిన 129 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు తాహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే తెలిపారు. అనంతరం వాంకిడి, కెరమెరి మండలాల్లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, మాజీ సర్పంచులు భీమేష్ ,బాబురావు, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు రవీందర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.