కుమ్రంభీంఅసిఫాబాద్, (విజయక్రాంతి): విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రభుత్వం విస్మరిస్తుందని ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆరోపించారు. వాంకిడిలోని ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలైన విద్యార్థులు నేటికీ కోల్పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గురుకులాలు ,ఆశ్రమ విద్యాలయాలు విష వలయాలుగా మారాయి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం నిర్లక్ష్య పూరిత వైఖరి తో ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలని ప్రశ్నించారు. ఫుడ్ పాయిజన్ తో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. శైలజకు ఏమైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.