calender_icon.png 22 November, 2024 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

03-11-2024 08:41:25 PM

దౌల్తాబాద్,(విజయక్రాంతి):  కరెంటు షాక్ తో ఇల్లు దగ్ధమైన అర్జున్ కుటుంబానికి అండగా ఉంటామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. గాజులపల్లి గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్ తో ఇల్లు దగ్ధం కావడంతో  విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. విద్యుత్ షాక్ తో ఇల్లు దగ్దమైన విషయాన్ని బాధిత కుటుంబ సభ్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు  ఇల్లు దగ్ధం కావడం పట్ల ఆయన తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. ఇల్లు దగ్ధమైన విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి సహాయం అందే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ అప్ప వారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బొల్లి చంద్రం, మండల బీఆర్ఎస్ యువజన అధ్యక్షులు రాజేందర్, నాయకులు పంజా స్వామి, అంజి తదితరులున్నారు.