calender_icon.png 10 January, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువు నీటిని వదిలిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

04-01-2025 09:12:18 PM

చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండలంలో యాసంగి పంటల సాగు కోసం బోనాల, కొండాపూర్ గ్రామంలో చెరువు తూము నుండి చెరువు నీటిని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం చేగుంట పట్టణానికి చెందిన మెదక్ జిల్లా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మెంబర్,తెలంగాణ రాష్ట్ర మెడికల్ అసోసియేషన్ కోశాధికారి తోడుపునూరి రాజు తండ్రి ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని,  వారిని పరామర్శించారు. వీరితో పాటు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణరెడ్డి, మాజీ జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, చేగుంట యువ నాయకుడు డిష్ రాజు, ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.