10-04-2025 01:44:52 AM
చేగుంట, ఏప్రిల్ 9ః చేగుంట మండలం వడియారం గ్రామంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఐకెపి కేంద్రాన్ని బుధవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్య కొనుగోలు కేంద్రాన్ని గ్రామంలో ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ధాన్యాన్ని శుభ్రంగా తాలు లేకుండా చేసి 17 శాతం తేమ ఉండేటట్లుగా చేసుకొని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని రైతులను కోరారు.
ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ను ప్రతి రైతు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట తహసిల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో చిన్నారెడ్డి, మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్, ఏపిఎం నర్సమ్మ, మాజీ జడ్పీటీసీ ఆముదం శ్రీనివాస్, జిల్లా నాయకులు రంగయ్య గారి రాజిరెడ్డి, చేగుంట తాజా మాజీ సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, సినియర్ నాయకులు మొహమ్మద్ అలీ, తనిషా పాల్గొన్నారు.