01-04-2025 12:59:05 AM
చేగుంట, మార్చి 31: చేగుంట పట్టణంలోని ఈద్గా (మస్జిద్) ల వద్ద సోమవారం రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం అని ముస్లింలు నెల రోజులు కఠిన ఉపవాస దీక్షల అనంతరం పండుగను జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ముదాం శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, సర్పంచ్ పోరం మండల శాఖ మాజీ అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్ , పార్టీ సీనియర్ నాయకులు, రాజిరెడ్డి,మాధవరెడ్డి , ఎర్ర యాదగిరి, పల్లె క్రాంతి, డిష్ రాజు, లక్ష్మీనారాయణ, నాగరాజు, మైనార్టీ నాయకులు, షకీల్, రహీముద్దీన్, మాజీ ఉపసర్పంచ్ నీయమతుల్లా, రబ్బాని, ఆరిఫ్, మస్జిద్ ఇమామ్ మొహమ్మద్ అన్వర్ పాల్గొన్నారు.