10-02-2025 05:21:11 PM
చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని కర్నాల్ పల్లి గ్రామంలో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.