calender_icon.png 8 January, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

06-01-2025 08:01:08 PM

చేగుంట: మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో సోమవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో 108 అంబులెన్స్ పచ్చ జెండా ఊపి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైద్యులు ప్రజలకు సేవలు అందించడానికి అందుబాటులో ఉండాలన్నారు. ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. 44 జాతీయ రహదారిపై ఆస్పత్రి ఉన్నందున పలు గ్రామాల నుంచి రోగులు వస్తుంటారని ప్రమాదాలు జరిగి క్షేత్రగాత్రులు వస్తున్నందున వారందరికీ వైద్య సేవలు అందించాలని సూచించారు ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉన్నదని డాక్టర్ రవికుమార్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆనంద్, ఎమ్మార్వో కరీ, మాజీ ఎంపీపీ సబిత, మాజీ జెడ్పిటిసి బాణాపురం కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాబు, ఆకుల మల్లేశం గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, భూపతి రాజు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.