ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని టేకులపల్లి మండలంలోని పలు పంచాయతీల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. తూర్పుగూడెం, పెగళ్లపాడు, రాంపురం, పాతతండ, కొత్తతండ (పి) పంచాయతీలో సిసి రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. టేకులపల్లి పంచాయతీలోని బ్రహ్మంగారి వీధి, దాసుతండా పంచాయతీలోని లచ్చతండ, గోలియాతండ పంచాయతీలో అంతర్గత రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. కొప్పురాయి పంచాయితీ లక్మీ పురం, బర్లగూడెం పంచాయితిలోని బర్లగూడెం, జంగాలపల్లి గ్రామాల్లో సిసి రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూక్యా దేవా నాయక్, నాయకులు కోరం సురేందర్, ఈది గణేష్, మోకాళ్ళ పోశాలు, ఇస్లావత్ రెడ్యానాయక్, రాచమళ్ళ నరసయ్య, కోరం హన్మంతు, రావూరి సతీష్, ఎంపీఓ గణేష్ గాంధీ, ఏఈ నవీన్, ఆయా పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.