calender_icon.png 27 January, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కోరం

26-01-2025 05:57:17 PM

ఇల్లెందు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలను ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య, భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ పైలెట్ ప్రాజెక్టు కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కోయగూడెం పంచాయతీలో ఎంపికైన కుటుంబాలకు ఆదివారం అందించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అందించడం జరుగుతుందని గత పాలకులు చెప్పింది కొండంత చేసింది గోరంత అని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక గ్రామ సభల్లో అల్లర్లు సృష్టిస్తున్నారని, రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే కోరం కనకయ్య హెచ్చరించారు.

ఎవరు నిరాశ చెందాల్సిన పనిలేదని అర్హత గల వ్యక్తులు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ఇది నిరంతర ప్రక్రియ అని ప్రజలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్, డీఎస్ పి చంద్రబాను, తహసీల్దార్ నాగ భవాని, కోయగూడెం మాజీ సర్పంచ్ ఉమా, ఎంపీడీఓ రవీందర్ రావు, సిఐ  తాటిపాముల సురేశ్, ఎస్ ఐ శ్రీకాంత్, ఇతర అధికారులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దేవానాయక్, నాయకులు ఈది గణేష్, మంగిళాల్, సర్దార్, రవి, బండ్ల రజినీ, బండ్ల శ్రీనివాసరావు, లక్కినేని శ్యామ్, మురళీ, జాల మురళీ, ఉదయ్, అశోక్, హనుమంతు, బన్సీ లాల్, కోటి, విజయ్, మూడు గణేష్, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.