ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు, టేకులపల్లి మండలంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇల్లందులో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించగా, టేకులపల్లి మండలంలోని పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ, బ్యాంకులు, ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో అధికారులు, విద్యార్థులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.