calender_icon.png 3 April, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే కోరం

01-04-2025 07:34:18 PM

ఇల్లెందు టౌన్, (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పథకాన్ని ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డ్ షాప్ నెంబర్ 45 నందు శాసనసభ్యులు కోరం కనకయ్య మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశం సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమే అన్నారు. ఈ పథకం ద్వారా అర్హత గల కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రతి పేద కుటుంబం ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని సమృద్ధిగా అందుకునేలా ఈ పథకం రూపొందించబడిందని తెలిపారు. సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలు లేకుండా చూసుకోవాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండల రాము, మడుగు సాంబమూర్తి, బోల్ల సూర్యం, చిల్లా శ్రీనివాస్, కాకాటి భార్గవ్, పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, ఉల్లింగ సతీష్, జాఫర్, ఎర్రసంగి వెంకన్న, మాజీ కౌన్సిలర్ మొగిలి లక్ష్మి, సైదామియా, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.