calender_icon.png 2 April, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీటీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

01-04-2025 05:26:07 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి నుంచి బోడు వెళ్లే మార్గంలోని రేగులతండా- దాసుతండ బీటీ రోడ్డు విస్తరణ పనులను మంగళవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఏడాదిన్నర కాలంగా నిర్మాణంలో ఉన్న రేగులతండ-దాసుతండా బీటీ వేయాలని పలుమార్లు రహదారిపై బైఠాయించి ఆందోళనలు చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రత్యేక చొరవ తీసుకుని నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రెడ్యా నాయక్, సొసైటీ డైరెక్టర్ బాలాజీ నాయక్, తండా నాయకులు పాల్గొన్నారు.