calender_icon.png 30 March, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామ ప్రాజెక్టు నీరు ఇల్లెందుకు రాక తీవ్ర అన్యాయం

27-03-2025 01:24:15 PM

అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య 

ఇల్లెందు, (విజయక్రాంతి): 2016 లో ఇల్లెందు నియోజకవర్గం(Yellandu Constituency)లోని టేకులపల్లి మండలం(Tekulapalli Mandal) రోళ్లపాడు గ్రామం వద్ద సీతారామ ప్రాజెక్టు(Sitarama project)ను గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ శంఖుస్థాపన చేశారని, అయినా ఇప్పటి వరకు నియోజకవర్గానికి చుక్క నీరు రాలేదని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అసెంబ్లీ సమావేశాల్లో గురువారం ప్రస్తావించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే మూడు జిల్లాలకు విస్తరించి ఉన్న ఇల్లెందు నియోజక వర్గం  6,74,000 ఎకరాలకు నీరంది భూములు సాగులోకి వచ్చేవని అన్నారు.

దానిని కారేపల్లి మండలం చీమలపాడు మీదుగా రావాల్సి ఉండగా దానిని జూలూరుపాడు మండలం మీదుగా పూర్తిగా నాగార్జునసాగర్ కాలువద్వారా నీరందే భూములకు కాలువలు మళ్లించి ఇల్లెందు నియోజకవరగానికి తీరని అన్యాయం చేశారన్నారు. ఎనభై శాతం గిరిజనులు ఉన్న ఈ ప్రాంతానికి సీతారామ ప్రాజెక్ట్ ద్వారా నీరిచ్చి రోళ్లపాడు ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామన్న నిలవలేదన్నారు. దీనితో ఇక్కడి భూములకు ఎప్పటిలాగే సాగు నీరు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మూడు జిల్లాలకు విస్తరించి ఉన్న ఇల్లెందు నియోజకవర్గానికి ప్రజాప్రభుత్వం చొరవ చూపి నిధులు కేటాయించి సీతారామ ప్రాజెక్టు నీరు వచ్చేలా చేయాలనీ విజ్ఞప్తి చేశారు.