calender_icon.png 5 December, 2024 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

04-12-2024 03:38:33 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  ఇల్లెందు నియోజక వర్గం టేకులపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. రేంజ్ ఆఫీస్ ప్రాంగణంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ  జి కృష్ణ గౌడ్, ఎఫ్డిఓ యు కోటేశ్వరరావు , ఎఫ్ఆర్ఓ ముక్తా హుస్సేన్, సెక్షన్ ఆఫీసర్లు శ్రీను, పి దేవ సింగ్, ఎం హాసిరాం, బీట్ అధికారులు ఎస్ నగేష్, డి రామ్మూర్తి, బి రామ్ సింగ్, బి పవన్ కుమార్, ఏ గాంధీ, బి లక్పతి, జి లక్ష్మణ్, బి రవి, ఎల్ గౌరమ్మ, బి శ్రీలత, సీనియర్ అసిస్టెంట్ అశోక్, కంప్యూటర్ ఆపరేటర్ బలరాం, బేస్ క్యాంప్ నరేష్ నాయకులు కోరం సురేందర్, భూక్యా దళ్ సింగ్ నాయక్, ఇస్లావత్ రెడ్యా నాయక్, ఈది గణేష్, మూడ్ సంజయ్, బర్లగూడెం మాజీ సర్పంచ్ మోహన్, నెహ్రు, నాకా, సతీష్, సుదీప్, వెంకన్న, ఇస్లావత్ రాజేందర్ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.