ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించిన మండల ప్రాథమిక సహకార పరపతి సంఘం కార్యాలయం, గోదామును ఎమ్మెల్యే వారం కనకయ్య బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారం కనకయ్య మాట్లాడుతూ... ఇల్లందు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రైతులకు ఎరువులు విత్తనాలు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ రవి, సొసైటీ చైర్మన్ మెట్ల కృష్ణా, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, మండల పార్టీ అధ్యక్షులు పులి సైదులు, ఉపాధ్యక్షులు ఆర్ఎం కిరణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.