09-04-2025 01:14:02 AM
పాల్గొన్న కలెక్టర్, ఐటిడిఏ పీఓ
టేకులపల్లి, ఏప్రిల్ 8 (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణి కార్యక్రమంలో భాగంగా మంగళవారం లచ్చగూడెం గ్రామంలోని సన్న బియ్యం లబ్దిదారులు గుమ్మడి సురేష్, శశికల ఇంట్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఐటిడిఏ పీఓ రాహుల్ భోజనం చేశారు.
వారితో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల అందుతున్నాయా అని వారిని అడిగారు. అతి త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు ప్రక్రియ మొదలవుతుందని వారికి తప్పకుండా కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో కుటుంబికులు హర్షం వ్యక్తం చేసారు. అనంతరం మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణి పథకం ఒక్కటే కాకుండ ప్రభుత్వం అందించే పథకాలు అన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య, కలెక్టర్ జీతేష్ వి పటేల్, పీఓ రాహుల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్, ఉమా, తహశీల్ధార్ నాగ భవాని, డిఎస్పీ చంద్ర భాను, ఎంపీడీఓ రవీందర్ రావు, ఎంపిఓ గణేష్ గాంధీ, సిఐ తాటిపాముల సురేష్, ఎస్త్స్రలు పోగుల సురేష్, శ్రీకాంత్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవా నాయక్, నాయకులు ఈది గణేష్, మోకాళ్ళ పోశాలు, రెడ్యానాయక్, వీరభద్రం, బండ్ల రజినీ తదితరులు పాల్గొన్నారు.