ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఇల్లందు ఏరియా నూతన జిఎం గా ఇటీవల నియమితులైన వీసం కృష్ణయ్యని మంగళవారం ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు కలిసి శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించారు. అనంతరం ఇల్లందు మున్సిపాలిటీకి సింగరేణి ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు అంకెపాక నవీన్ కుమార్, గిన్నారపు రజిత, సయ్యద్ ఆజాం, కటకం పద్మావతి, వారా రవి, మాజీ ఎంపీటీసీలు సురేందర్, మండల రాము, కాంగ్రెస్ నాయకులు మడుగు సాంబమూర్తి, బంకు శీను, బోళ్ల సూర్యం తదితరులు పాల్గొన్నారు.