calender_icon.png 18 April, 2025 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టేకులపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

10-04-2025 12:56:10 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 74 మంది లబ్దిదారులకు గురువారం ఎమ్మెల్యే కోరం కనకయ్య చెక్కులు పంపిణీ చేశారు. రూ. 22.32 లక్షల  చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ... అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇల్లందు నియోజకవర్గ నాయకులు  కోరం సురేందర్, కాంగ్రెస్  మండల అధ్యక్షులు దేవా నాయక్, నాయకులు ఈది గణేష్, మోకాళ్ళ పోశాలు, ఇస్లావత్ రెడ్యానాయక్, బానోత్ శంకర్, బానోత్ రవి, గడ్డం మధురెడ్డి, శంకర్, భద్రు, బుర్ర ధర్మయ్య గౌడ్, మంగీలాల్,చందర్ సింగ్, సంజయ్, బోడ సరిత, సునీల్, కాలే ప్రసాద్, నర్సింగ్ లక్ష్మయ్య, చెన్నయ్య, బొడ్డు అశోక్, నగేష్, ఈశ్వర్, చంటి, నవీన్, సురేందర్, వెంకట్, సుధీప్ తదితరులు పాల్గొన్నారు.