ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం టేకులపల్లి మండల పరిధిలోని బోడు గ్రామంలో రహదారులను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బుధవారం పరిశీలించారు. బోడు గ్రామంలోని పోలీస్ స్టేషన్ నుంచి బోడు కొత్తగూడెం క్రాస్ రోడ్డు వరకు ఇరువైపుల డ్రైనేజి, సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం కోసం పరిశీలించారు. రోడ్డు పనులు త్వరగా మొదలు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఎమ్మెల్యేని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, సిలివేరు చంద్రశేఖర్, పాయం రత్నం, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.