01-04-2025 07:36:21 PM
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లెందు పట్టణంలోని జగదంబ సెంటర్ లో గల ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షుడు ప్రొద్దుటూరి నాగేశ్వరరావు షాపు వద్ద మంగళవారం ఆర్యవైశ్య మహాసభ, వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉన్నందున ప్రజల దాహం తీర్చేందుకు ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మండల, యువజన సంఘం అధ్యక్షులు ప్రొద్దుటూరి నాగేశ్వరరావు, నరేంద్రుల అను, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లెర్ల చంద్రశేఖర్, చందా భద్రం, సుబ్బారావు, దివ్వెల నాగేశ్వరరావు, వాసవి క్లబ్ అధ్యక్షుడు భోనగిరి రవి కిరణ్, సత్యదర్, నాగరాజు, ఉపేందర్ నాథ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.