calender_icon.png 18 April, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు బస్టాండ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం

10-04-2025 06:40:12 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు ఆర్టీసీ బస్టాండ్ ను శాసనసభ్యులు కోరం కనకయ్య గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. బస్టాండ్ లోని ప్రయాణికులతో ముచ్చటించారు. బస్టాండ్ లోని ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడారు. బస్టాండ్ లో ఉన్న కార్గో సెంటర్ ను పరిశీలించారు. రోజు ఇక్కడ నుండి వెళ్లే ప్రయాణికుల సంఖ్య కార్గో, పార్సిల్ ఎన్ని తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ సిబ్బందితో మాట్లాడారు. బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. బస్ స్టేషన్ లో ఉన్న షాపులను పరిశీలించారు.

షాపులలో న్యాయమైన ఆహార వస్తువులు ఉండాలని, కాలం చెల్లిన ఆహార వస్తువులు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టాల్స్ లో అదనపురేట్లకు వస్తువులు అమ్మరాదని ఒకవేళ అలాంటి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రింకింగ్ వాటర్ ను పరిశీలించారు. ప్లాట్ ఫామ్ లను పరిశీలించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండల రాము, మడుగు సాంబమూర్తి, మాజీ ఎంపిటిసి పూణెం సురేందర్, డి శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.