calender_icon.png 22 April, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా

21-04-2025 11:55:16 PM

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని

పాల్వంచలో పెన్షనర్స్ డే వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే

పాల్వంచ,(విజయక్రాంతి): సమిష్టి పోరాటాలతో రిటైర్డ్ ఉద్యోగస్తుల హక్కులు సాధించుకోవాలని కొత్తగూడెం శాసనసభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం స్థానిక రిటైర్డ్ ఉద్యోగస్తుల బిల్డింగ్ వద్ద ఏర్పాటుచేసిన పెన్షనర్స్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మాజీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పెండింగ్ డిఏలు, పిఆర్సి అమలు, వెల్నెస్ సెంటర్ల స్థాపనకు, ఆరోగ్య బీమా పథకం అమలకు తన వంతు కృషి చేస్తానని, పెన్షనర్స్ భవనంలో మీటింగ్ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే కోటా నుంచి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ తహసిల్దార్ వివేక్ మున్సిపల్ కమిషనర్ k. సుజాత, సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు, కొండా వెంకన్న, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు బండి నాగేశ్వరావు, ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, డీ సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు, పైడిపల్లి దుర్గా మహేష్, కుమార్ రాజు విజయ్, రాము, శాంత వర్ధన్, సుమ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.