calender_icon.png 26 March, 2025 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే కూనంనేని చిత్రపటానికి పాలాభిషేకం..

25-03-2025 10:48:00 PM

కార్పొరేషన్ తో పట్టణ రూపురేఖలు మారుతాయి.. 

మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి..

కొత్తగూడెం (విజయక్రాంతి): చుంచుపల్లి మండల పరిధిలోని బాబుక్యాంపు సిపిఐ మండల పార్టీ కార్యాలయం రజబ్ అలీ భవనము నందు మంగళవారం ఎమ్మెల్యే సాంబశివరావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. చుంచుపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి సమక్షంలో, కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు కృషి చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి, సహచర మంత్రి బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో ఎంతో కృషి చేస్తున్నారని, దానిలో భాగంగా కార్పొరేషన్ ఏర్పాటు వల్ల అన్ని రంగాలలో అభివృద్ధి చెందటంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందటంతో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని, గెలిచిన 15 నెలల కాలంలో కొత్తగూడెం నియోజకవర్గం రూపురేఖలు మార్చటానికి ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ భద్రాద్రి జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గారాసి వెంకన్న, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు మాధవరావు, బాబు క్యాంప్ మాజీ ఉపసర్పంచ్ పొలామూరి శ్రీనివాస్, చుంచుపల్లి మండల కౌన్సిల్ మెంబెర్ ఎండీ బాబ్జి, ఎన్ కె నగర్ మాజీ సర్పంచ్ రాంజీ, మాజీ ఉపసర్పంచ్ యాండ్ర మహేష్, తాళ్లూరి మధు, జే ఎం ఏ మురళి, రాంనగర్ మాజీ వార్డ్ మెంబెర్ కిట్టు, భాగం హనుమంతరావు, గాంధీ కాలనీ సిపిఐ నాయకుడు నగేష్, కాంగ్రెస్ నాయకులు బాబు, సిపిఐ మండల నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.