calender_icon.png 19 January, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గాన్ని అభివృద్దిలో ఆదర్శంగా నిలుపుతా

18-01-2025 10:41:13 PM

అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా

రూ 45 లక్షల పనులకు శంకుస్థాపన

భధ్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ది, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తానని, అనునిత్యం శ్రమిస్తూ, అవధులు లేని అభివృద్ది ఫలాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్ఠ చేశారు. శనివారం నియోజకవర్గం పరిదిలో రూ 45 లక్షల అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని ఆయన అన్నారు.  ఏజెన్సీ ప్రాంతాలకు జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెం పట్టణాన్ని నరగాలకు దీటుగా అభివృద్ది చేసేందుకు శక్తివంచన లేకుండా  కృషి చేస్తున్నానన్నారు. ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించానన్నారు.

ప్రజల అవసరాలు గుర్తించి ప్రాదాన్యతా క్రమంలో వివిధ పధకాల్లో నిధులు మంజూరు చేయించి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.  అభివృద్దిలో రాజకీయాలను తావుండబోదని, సమస్యలులేని ప్రతి వార్డు, ప్రతి పంచాయతీగా తీర్దిదిద్దె వరకు విశ్రమించబోనన్నారు.  సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే విధంగా కొత్తగూడెంలో విమనాశ్రయం నిర్మాణం, హరిత హోటల్, అభివృద్దికి బాటలువేసే కార్పోరేషన్ ఏర్పాటు  తన కల అని వీటిని సాకారం చేయడం సంతృప్తి కరంగా ఉందన్నారు. కొత్తగూడెం మున్సిపాల్టీ పరిదిలోని 27వ వార్డులోని ప్రగతి మైదానంలో రూ 20 లక్షలు,రూ 25 లక్షలతో ఎంపవర్మంట్ సెంటర్ అభివృ1ద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రదాన కార్యదర్శి  ఎస్‌కె సాబీర్ పాషా, మున్సిపల్ చైర్ పర్సన్ సీతాలక్ష్మి, తాహసిల్దార్ పుల్లయ్య, కమీషనర్ శేషాంజన్ స్వామి, డీఈ రవీందర్, కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, ధర్మరాజు, విజయ్‌హ కుమార్  తదితరులు పాల్గొన్నారు.