అమరావతి: తెలుగుదేశం పార్టీ (టిడిపి) పార్టీ మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేసింది. ఎమ్మెల్యే ఆదిమూలంను టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలతో చంద్రబాబు తీవ్ర చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది. తనను బెదిరించి 3 సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఇద్దరం కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నామని తెలిపింది. పార్టీ కార్యక్రమాల్లో పరిచయమై నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడని చెప్పిన బాధితురాలు ఎమ్మెల్యే ఆదిమూలం తనకు పదేపదే ఫోన్ చేసేవాడని ఆరోపించింది. లైంగిక కోరిక తీర్చకుంటే కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడని వాపోయింది. ఆదిమూలం గురించి అందరికీ తెలియాలని పెన్ కెమెరా పెట్టుకున్నానని బాధితురాలు వెల్లడించింది.