05-04-2025 08:39:42 PM
అండర్ 14 విభాగంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు,(విజయక్రాంతి): అణగారిక వర్గాల సంక్షేమం కోసం, కులహిత సమాజం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి నేటి తరానికి జగ్జీవన్ రావు జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో మరి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో జరిగిన జాతీయ వుడ్ బాల్ క్రీడ అండర్ 14 విభాగంలో మునుగోడు నియోజకవర్గం మర్రిగూడెం విద్యార్థుల ప్రతిభ, బాలికల విభాగంలో గోల్డ్ మెడల్, బాలుర విభాగం లో సిల్వర్ మెడల్స్ సాధించిన సెయింట్ మేరీ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు క్యాంపు కార్యలయం లో గోల్డ్ మెడల్ సాధించిన జి. సారిక, డి. నందిని లతో పాటు సిల్వర్ మెడల్స్ సాధించిన ముగ్గురు బాలురకు పథకాలు అందచేసి,మెడల్స్ సాధించడానికి కృషి చేసిన పీఈటీ పవన్, స్కూల్ ప్రిన్సిపాల్ జంగిడి ఝాన్సీలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ,పార్టీ సీనియర్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.