13-04-2025 02:58:57 PM
మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు
నేడు అడుక్కునే స్థితిలో ఎప్పుడూ ఉండను
మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు
హైదరాబాద్: మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తానని పార్టీ హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తన మంత్రి పదవి(Minister post) విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జానారెడ్డి(Kunduru Jana Reddy) వంటి వారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను అడుక్కునే స్థితిలో ఉండనని.. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదని తేల్చిచెప్పారు. జానారెడ్డి 30 ఏళ్లపాటు మంత్రి పదవి అనుభవిచారని చెప్పిన రాజగోపాల్ రెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్ కు పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు.