06-04-2025 07:40:46 PM
శ్రీరామనవమి వేడుకలలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
మునుగోడు (విజయక్రాంతి): శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కొంపల్లి, చీకటి మామిడి వివిధ గ్రామాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డితో కలిసి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ప్రతి పౌరుడు శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. శ్రీరాముడు సత్యానికి న్యాయానికి నిలువెత్తు నిదర్శనమని, భారతీయ సంస్కృతిలో శ్రీరాముని జీవితం గొప్ప మార్గదర్శకం, శాంతి, సహనం, కష్టాలను అధిగమించే ధైర్యం వంటి విలువలను శ్రీరాముని జీవితం నేర్పిస్తుందని అన్నారు. సీతారాముల ఆశీస్సులతో నియోజకవర్గం పాడి పంటలు పశు సంపద అష్టైశ్వర్యాలు, అభివృద్ధిలో ముందుండే విధంగా ఆయన కృప మనపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జీవనపల్లి సైదులు, శివాలయం చైర్మన్ వెదిరే విజయేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జాల వెంకటేశ్వర్లు, తాటికొండ సైదులు, వట్టి కోటి శేఖర్, జీడిమెట్ల యాదయ్య, దాం యాదయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.