calender_icon.png 28 December, 2024 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మ‌న్మోహ‌న్ సింగ్ సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం

27-12-2024 08:22:45 PM

మన్మోహన్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం 

మన్మోహన్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం 

ఆయన నాయకత్వం దేశ గమనాన్ని మార్చేసింది

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి): భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ మృతి పట్ల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించి సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోన‌య్యానని తెలిపారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుణ్ణి ప్రార్థిస్తున్నాన‌ని అన్నారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గల ఆర్థికవేత్త, మేధావి మాజీ ప్రధానమంత్రి, పద్మవిభూషణ్ డా. మన్మోహన్ సింగ్ మృతిప‌ట్ల‌ యావ‌త్‌ భారత్ సంతాపం తెలియ‌జేస్తోంది. ఆయన నాయకత్వం దేశ గమనాన్ని మార్చేసింది. ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిగా, ఆధునిక మరియు ప్రగతిశీల భారత్‌కు పునాది వేసిన మైలురాయి లాంటి ఎల్‌పీజీ ( లిబ‌ర‌లైజేష‌న్‌, ప్రైవేటైజేష‌న్‌, గ్లోబ‌లైజేష‌న్) సంస్కరణలను ఆయన ప్రవేశపెట్టారు.

పీవీ, మన్మోహన్ ద్వయం దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడింది. స్థిరత్వాన్ని పునరుద్ధరించారు. వారు ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక సంస్క‌ర‌ణ‌లే ప్ర‌పంచంలో మ‌న దేశం త‌లెత్తుకుని నిల‌బ‌డేలా చేశాయి. యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో డాక్టర్ మన్మోహన్ సింగ్.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ), సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ), విద్యా హక్కు వంటి మైలురాయి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఇది మిలియన్ల మంది జీవితాలను తాకింది. ఆయ‌న మేధ‌స్సు, చిత్తశుద్ధి, ప్రజా సేవ పట్ల అంకితభావం దేశాభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేసిన నాయకుడిగా ఆయనను నిలబెట్టాయి. మ‌న్మోహ‌న్ సింగ్ ప‌నిత‌నం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయ‌న‌ నిశ్శబ్దం పెద్ద గొంతు కంటే పెద్దదిగా మాట్లాడింది.

ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భ‌గ‌వంతుణ్ణి కోరుకుంటున్నాను అని అన్నారు. అనంతరం మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎంపీపీ పొలగోని సత్యం,ఓబీసీ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బూడిద లింగయ్య యాదవ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమన పల్లి సైదులు, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి,ఎస్సీ సెల్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు బోయపర్తి లింగయ్య,మాజీ సర్పంచ్ లు జాల వెంకన్న, పాలకురి యాదయ్య,ఎస్సీ సెల్ మునుగోడు మండలం అధ్యక్షుడు గాదేపాక అంజయ్య,ఎండీ అన్వర్,కుంభం చేన్నా రెడ్డి,సోమగోని రమేష్,సాగర్ల లింగ స్వామీ,జిట్టగోని యాదయ్య ఉన్నారు.