04-04-2025 07:13:20 PM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
అక్రమంగా మద్యం అమ్మే వారిని ఉపేక్షించం
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు(చండూరు),(విజయక్రాంతి): దేశ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే శ్రీకారం చుట్టిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీలో ప్రభుత్వం పేదలకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరై అర్హులైన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసిన చేశారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారు గడ్డలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.16 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ చేసాం, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించాం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నాం, సిలిండర్ పై 500 రూపాయల సబ్సిడీ ఇస్తున్నాం అని అన్నారు.
సన్న బియ్యం పంపిణీ చేయాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , సివిల్ సప్లై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలంగాణ ప్రజల తరఫున మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గత ప్రభుత్వంలో ఉప ఎన్నిక వస్తేనే రేషన్ కార్డులు ఇచ్చారని, ప్రజా ప్రభుత్వంలో ఉప ఎన్నికలు లేకపోయినా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తాం అని అన్నారు.రాబోయే రోజుల్లో పింఛన్లు రేషన్ కార్డులు, పేదవారికి ఇల్లు కట్టించే బాధ్యత నాది అని తెలిపారు.నియోజకవర్గంలో ఆక్రమంగా మద్యం అమ్మిన, చాటుమాటుగా మద్యం అమ్మే వాళ్లను ఉపేక్షించము కేసులు పెట్టించి,కాంగ్రెస్ పార్టీ అయినా బిజెపి పార్టీ అయినా బిఆర్ఎస్ పార్టీ అయినా ఏ పార్టీ నాయకుడైన అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పు చేసిన వ్యక్తి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్న బియ్యం పంపిణీ లబ్ధిదారులు ఉన్నారు.