గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు ఫిర్యాదు
గజ్వేల్, అక్టోబర్ 6: గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదంటూ టీపీసీసీ అధి కార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు ఆదివారం గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఆచూకీ తెలిపి నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకురావాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు పది నెలలు కావొస్తున్నా ఇప్పటికీ కేసీఆర్ ప్రజలకు కనపడలేదని, ప్రజలంతా కేసీఆర్ క్షేమంగా ఉన్నారా.. లేదా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు.
వెంటనే పోలీసులు కేసీఆర్ ఎక్కడున్నా గుర్తించి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో టీపీ సీసీ రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి, పార్టీ మండలాధ్యక్షుడు మద్దూరి మల్లారెడ్డి, తీగుల్ మాజీ సర్పంచ్ భానుప్రకాశ్ పాల్గొన్నారు.