తిమ్మాపూర్, ఫిబ్రవరి 2: కరీంనగర్ పట్టణ కార్ మెకానిక్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్గునూర్ లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఆదివారం మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్య నారాయణ బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని అం దించడంతో పాటు యువతలో సమగ్ర వ్యక్తి త్వాన్ని పెంపొందించేందుకు దోహదప డతాయని పేర్కొన్నారు. క్రీడల ద్వారా స్నేహ భావం, టీమ్ స్పిరిట్ పెంపొందుతాయని, యువత ఆధ్యాత్మికంగా, సామాజికం గా అభివద్ధి చెందేందుకు క్రీడలు ఎంతో ఉప యోగకరమని ఆయన పేర్కొన్నారు.
క్రీడా కారులు మరింత ప్రోత్సాహం పొందేందుకు ప్రభుత్వ సహాయ సహకారాలను అందిం చేందుకు తనవంతు కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్ మెకానిక్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకా రులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ్మనవేని రమేష్, కాలువ మల్లేశం, ప్రజా ప్రతినిధులు, స్పోర్ట్స్ అభిమానులు, యువ కులు పాల్గొన్నారు.