calender_icon.png 23 December, 2024 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత మెఘా వైద్య శిబిరం తిమ్మాపూర్‌లోప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

23-12-2024 12:54:53 AM

మానకొండూర్, డిసెంబర్ 22 : కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక  పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్  కవ్వంపల్లి సత్యనారాయణ,మాదన వీర శేఖర్ తో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ  గ్రామీణ ప్రజల కోసం మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఈ శిబిరంలో 261 మందికి ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ అనీష్, సర్జికల్ గ్యాస్ట్రో డాక్టర్ దిలీప్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నాగరాజు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి షుగర్, బీపీ,ఈసిజి , 2డి ఎకో పరీక్షలు చేపట్టి రోగనిర్దారణ చేశారు. మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తక్కిటి రవీందర్ రెడ్డి, మాతంగి శంకర్, కిరణ్, మాదన వీరయ్య, లక్ష్మారెడ్డి, మాదన సంతోష్, అడిచెర్ల తిరుపతి, అడిచెర్ల మహేందర్, వడ్లకొండ సాయికిరణ్, మాదన శ్రీనివాస్, పోలు రాము,రమేష్, గంకిడి బాపురెడ్డి, ఓుంగంటి శారద, నగునూరి మంజుల, బిస్మిల్లా,జక్కోజు రమేష్,దుండే వీర శేఖర్, తదితరులు పాల్గొన్నారు.