హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విచారణ జనవరి 6కు వాయిదా పడింది. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర విధులకు ఆటంకం కలిగించా కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై శుక్రవారం విచారణకు హాజరుకావాలని మాసబ్ ట్యాంక్ పోలీ కౌశిక్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు.
అయితే తన తండ్రికి గుండె ఆపరేషన్ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఎమ్మె కౌశిక్‌రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విచారణను జనవరి 6 విచారణకు హాజరుకావాలని పోలీసులు మరో నోటీసు అందజేశారు.