calender_icon.png 18 January, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి

17-01-2025 09:02:37 PM

కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగిస్తూ నిరసన...

హుజూరాబాద్ (విజయక్రాంతి): హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, మరోసారి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులపై విమర్శలు చేస్తే ఊరుకోమని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో శుక్రవారం అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగిస్తూ ఊరేగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి, మంత్రుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, తన పేరు కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎంపై అసత్యపు ఆరోపణలు చేస్తూ పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అసత్యపు ఆరోపణలు చేయడం మానుకొని నోరును అదుపులో పెట్టుకోవాలని, లేనియెడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హుజూరాబాద్ లో తిరగనివ్వకుండా అడ్డుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళనాయకురాలు పాల్గొన్నారు.