calender_icon.png 1 April, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ అధికారులు, సిబ్బందిని అభినందించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

29-03-2025 10:28:58 PM

హుజూరాబాద్ (విజయక్రాంతి): వందశాతం ఆస్తి పన్నుల వసూలు చేసి హుజూరాబాద్ మున్సిపాలిటీని టాప్ నిలిపిన మున్సిపల్ అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశంసిస్తూ అభినందించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని కేసి క్యాంప్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతో పాటు అధికారులు, సిబ్బందిని శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం సుమారు 30 లక్షల రూపాయలు ఎక్కువగా వసూలు జరిగాయని, ఇందుకు అధికారుల కృషి ఎంతో ఉందన్నారు.

ఆస్తి పన్నుల వసూలులో గత సంవత్సరం కంటే 12 శాతం ఎక్కువగా 100శాతం పన్నులు వసూలు చేసి, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం గొప్ప విషయమన్నారు. తద్వారా 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు పూర్తిస్థాయి అర్హతలు సాధించిందన్నారు. ఇదే స్ఫూర్తితో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, గందె శ్రీనివాస్, మున్సిపల్ మేనేజర్ భూపాల్రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ కిషన్రావు, జవాన్లు ప్రతాప రాజు, రమేష్, సుధీర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.