హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 (విజయక్రాంతి) : “నా ఇంటి డోర్లు పగులగొట్టి బెడ్‌రూమ్ వద్దకు వచ్చి అరెస్టు చేయడానికి నేనేమైనా క్రిమినల్‌నా” అంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత డిసెంబర్ 4న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సీఐతో జరిగిన వాగ్వాదం సంఘటనకు సంబం ధించి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైన విషయంలో శుక్రవారం విచారణ నిమిత్తం ఆయన మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. విచారణకు సహకరించేందుకు స్టేషన్‌కు వచ్చినట్టు తెలిపారు.