calender_icon.png 27 December, 2024 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మ జ్యోతిబాపూలే బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

03-11-2024 12:03:02 PM

పూరీలు చేస్తూ ఎమ్మెల్యే కంటబడిన విద్యార్థినిలు

వసతి గృహం అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

కామారెడ్డి, (విజయ క్రాంతి): కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదివారం ఉదయం నియోజకవర్గంలోని భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద గల కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల విద్యార్థినిలు పూరీలు చేస్తూ ఎమ్మెల్యే కంట పడ్డారు. దీంతో ఎమ్మెల్యే కా టిపల్లి వెంకటరమణారెడ్డి స్కూల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వంట సహాయకులు రాకపోవడం వల్ల కుక్  కు సహాయంగా పూరీలు చేస్తున్నట్లు విద్యార్థినిలు ఎమ్మెల్యేకు తెలిపారు. అలా చేయొద్దు అంటూ విద్యార్థినిలకు ఎమ్మెల్యే నచ్చ చెప్పారు. మీ తల్లిదండ్రులు మంచిగా చదువుకోవాలని పంపిస్తే మీరు ఈ పనులు చేస్తారంటూ ఎమ్మెల్యే విద్యార్థినీలతో మాట్లాడారు. మంచిగా చదివి తల్లిదండ్రుల పేరును పాఠశాల పేరును నిలబెట్టే విధంగా చదివి ప్రయోజకులు కావాలని సూచించారు. కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే కా టిపల్లి వెంకటరమణారెడ్డి అల్పాహారం చేశారు. విద్యార్థినిల చేత ఇలాంటి పనులు చేయించవద్దని గురుకుల పాఠశాల అధ్యాపకులకు ఎమ్మెల్యే సూచించారు.