తలకొండపల్లి, జనవరి20 (విజయ క్రాంతి): తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో ఫిబ్రవరి 7,8,9 తేదిలలో నిర్వహించే శ్రీశ్రీశ్రీ వేదాద్రి లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని నిర్వాహకులు సోమవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
అదేవిధంగా ఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిదిలోని కర్కాస్ తాండా కు చెందిన సభావత్ మన్నికి పోస్టల్ డిపార్టుమెంటు నుండి మంజూరైన జీవిత భీమా రూ 10లక్షల చెక్కును ఖానాపూర్ గ్రామంలో గ్రామస్తుల సమక్షంలో అందజేశారు.
లింగరావుపల్లి గ్రామంలో 30 కుటుంబాలకు రేషన్ కార్డులు లేవని వారికి రేషన్ కార్డులు మంజూరు చేయించాలని పిఎసిఎస్ ఛైర్మన్ గట్ల కేశవరెడ్డి ఆద్వర్యంలో లబ్దిదారులు ఎమ్మెల్యే నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామా నాయకులు ప్రజలు పాల్గొన్నారు.