ఇల్లెందు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని టేకులపల్లి మండలం బొమ్మనపల్లిలో బేతంపుడి పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం ప్రారంభించారు. అంతకు ముందు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్రావు, పిఏసిఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, ఏలూరి కోటేశ్వరరావు, ఇస్లావత్ రెడ్యానాయక్, పోశాలు, ఈది గణేష్, బుర్ర ధర్మయ్య గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.