calender_icon.png 17 April, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జా చేసినట్లు నిరూపిస్తే.. పల్లా, రాజయ్య ఇంట్లో గులాంగా పనిచేస్తా

08-04-2025 12:12:29 PM

మీరు నాకు గులాంగా ఉంటారా?

హైదరాబాద్: తనపై వస్తున్న భూకజ్జా ఆరోపణలపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Station Ghanpur MLA Kadiyam Srihari) తీవ్రంగా ఖండించారు. హనుమకొండలో మీడియా సమావేశం నిర్వహించిన కడియం శ్రీహరి దేవునూరు గుట్టలను ఆక్రమిస్తున్నారన్న ఆరోపణలను తోసిపుచ్చారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అక్రమాలు చేయలేదని వివరించారు. 2 వేల ఎకరాలు కబ్జా చేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కడియం శ్రీహరి(Kadiyam Srihari) సవాల్ విసిరారు. పదవికి రాజీనామా చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్య ఇంట్లో గులాంగా పనిచేస్తా, ఆరోపణలు నిరూపించకపోతే మీరు నాకు గులాంగా ఉంటారా? అని కడియం శ్రీహరి ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కడియం హెచ్చరించారు.