calender_icon.png 21 October, 2024 | 8:23 PM

అందుకే..! కల్వకుంట్ల ఫ్యామిలీ నన్ను పక్కన పెట్టింది

21-10-2024 04:49:58 PM

2014లో కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎంత.. ఇప్పుడెంత..?

హైదరాబాద్: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కల్వకుంట్ల కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ అధికారంలో ప్రభుత్వ విధానాలు సరిగా లేవని ప్రశ్నించినందుకే తనను పక్కన పెట్టారని వెల్లడించారు. జనగామ జిల్లా మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఉపయోగపడే పనులు జరగలేదని.. కేసీఆర్ హయాంలో కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేశారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుందని ఎమ్మెల్యే కడియం ఆరోపించారు. బీఆర్ఎస్ అంటేనే కేటీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ అన్నారు. 20214లో కేసీసఆర్ కుటుంబం ఆస్తులు ఎంత.. ఇప్పుడెంత..? నీతిమంతులైతే.. ఆస్తుల వివరాలు వెల్లడించాలని కడియం డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ మాయమాటలు నమ్మితే నష్టపోతామని చెప్పారు. కేసీఆర్ స్థానం కోసం కేటీఆర్, హరీశ్ రావు పోటీ పడుతూ ఫోటోస్ కోసం ప్రెస్ మీట్ లు పెడుతున్నారని ద్వజమెత్తారు.