దిల్లీలో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తే అధికారంలోకి వచ్చేవి
ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించిందే బీర్ఎస్: కడియం
హైదరాబాద్: గత ప్రభుత్వం ఐదేళ్లు ఏలాంటి అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) ఆరోపించారు. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కోర్టు పరిధిలో ఉందని కడియం శ్రీహరి వెల్లడించారు. అనర్హతపై కోర్టు తీర్పును శిరసావహిస్తానని కడియం(Kadiyam Srihari) పేర్కొన్నారు. ఉపఎన్నిక వస్తే.. పారిపోను, నిలబడి పోరాడుతానని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని కడియం శ్రీహరి వివరించారు. ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించిందే బీర్ఎస్ అన్నారు. ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ 10 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఢిల్లీలో బీజేపీ గెలిస్తే ఇక్కడ కేటీఆర్ సంతోషపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆప్ ఓటమికి కారణం.. బీఆర్ఎస్ స్నేహం చేయడమేనని జోస్య చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్(Congress), ఆప్ కలిసి పోటీ చేస్తే అధికారంలోకి వచ్చేవని ఆయన వివరించారు.