calender_icon.png 29 December, 2024 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జారె

04-12-2024 07:18:30 PM

అశ్వారావుపేట (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీల ఆటో బుధవారం ఉదయం ఆసుపాక నుంచి అశ్వారావుపేట వైపు వస్తుండగా కుక్క అడ్డురావడంతో తిమ్మాపురం వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టగా గాయలైన క్షతగాత్రులను అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాల్సిందిగా డాక్టర్లకు సూచించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.