calender_icon.png 22 February, 2025 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కట్టమైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

16-02-2025 02:53:30 PM

అశ్వారావుపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేట మండలం నారాయణపురం వెలిసిన కట్ట మైసమ్మ ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్న దానం చేశారు. అనంతరం కావడిగుండ్ల గ్రామంలో షేక్ జలాలుద్దీన్ - బీప్జాన్ దంపతుల కుమారుడి పంచకట్టు వేడుక కుమార్తె నూతన వస్త్రాలంకరణ వేడుకులో పాల్గొన్నారు. అదే గ్రామంలో జ్ఞానాల వెంకటేశ్వరరావు గారి మనవడు మనవరాలి నూతన వస్త్రాలంకరణ వేడుక జరగగా అందుబాటులో లేకపోవడం వల్ల ఆదివారం  వారి కుటుంబాన్ని సందర్శించి చిన్నారులను ఆశీర్వదించారు . ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.