15-03-2025 12:24:50 AM
జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్
సూర్యాపేట, మార్చి14(విజయక్రాంతి) : ప్రజాసమస్యలపై గలమొత్తుతున్న ప్రజా నాయకులు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సస్పెన్షన్ను ఎత్తివేయాలి బీఆర్‌ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులు, మలిఎ దశ ఉద్యమాకారులు నిరసనలు, సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జగదీష్రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అవమానించేలా వాఖ్యలు చేయలేదని, స్పీకర్ కుటుంబానికి పెద్దరికం వహిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారని అన్నారు. దళిత కార్డుతో కాంగ్రేస్ రాజకీయాలు చేస్తుందన్నారు. దళిత స్పీకర్ ను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. జగదీష్రెడ్డి దళిత పక్షపాతి అన్నారు. ఆయనపై విదించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.