01-03-2025 11:46:11 PM
కంటతడి పెట్టిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
పెన్‌పహాడ్: దండం పెట్టి అడుగుతున్నా.. పంటల సాగుకు నీటిని విడుదల చేసి రైతులను బతికించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి కోరారు. శనివారం పెన్‌పహాడ్ మండల పరిధిలోని ఎస్సారెస్పీ కాలువ ఆయకట్టు కింద సాగు నీరు అందక ఎండిన పంటలను సందర్శించి, మీడియాతో మాట్లాడారు. సూర్యాపేట ప్రాంత రైతుల తరఫున దండం పెట్టి అడుగుతున్నా.. నీళ్లు ఇవ్వండి.. రైతులను బతికించండి అని జగదీశ్‌రెడ్డి రైతులను చూసి కన్నీరు పెట్టుకున్నారు. నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండిపోయేలా చేసి రైతును అప్పుల ఊబిలోకి కాంగ్రెస్ ప్రభుత్వం నెడుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నీళ్లు ఇవ్వకుండా గొర్లను పంపించి పచ్చని పొలాలు పశువులకు మేతగా మార్చాడని విమర్శించారు.