13-03-2025 11:52:51 AM
గవర్నర్ ప్రసంగంలో నిజం లేదు
గవర్నర్ తో 36 నిమిషాల్లోనే 360 అవాస్తాలు చెప్పించారు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) రెండో రోజు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ విఫ్, కిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(MLA Jagadish Reddy) శాసనసభలో మాట్లాడుతూ... గవర్నర్ ప్రసంగంలో నిజం లేదని ఎమ్మెల్యే జగదీష్ పేర్కొన్నారు. బడ్జెట్ ముందు గవర్నర్ చేసే ప్రసంగం గొప్పగా ఉండాలని ఆయన వెల్లడించారు. గవర్నర్(Governor Jishnu Dev Varma)తో 36 నిమిషాల్లోనే 360 అవాస్తాలు చెప్పించారు. గవర్నర్ కూడా ప్రసంగాన్ని మనస్ఫూర్తిగా చేదవలేదని ఎమ్మెల్యే జగదీష్ ఆరోపించారు. నిన్న అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగం విని , తర్వాత ఆ స్పీచ్ పుస్తకాలు చూస్తే మాకు అర్ధం అయింది ఏందంటే ఇది ఏఐ- చాట్ జీపీటీ వాడి రాసినట్టు ఉంది.. తప్పితే నిపుణుల సూచనలు సలహాలతో రాష్ట్రం బాగు కోసం రాసింది కాదు అని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.